శ్రీ దగ్గుబాటి శ్రీరామం & శ్రీమతి అజంతా గారి ఇంట్లో సమావేశం!

ఈ నెల తెలుగు వాహిని సమావేశం 21st March 2015న శ్రీ దగ్గుబాటి శ్రీరామం & శ్రీమతి అజంతా గారి ఇంట్లో జరుగనున్నది. సమయం సాయంత్రం 4:00 గంటలకు (ఠంచనుగా).

ఈ సమావేశాన్ని శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది మరియు ప్రత్యేక తెలుగువాహిని వార్షికోత్సవ సమావేశముగా జరుపుకొంటున్నాము!!

పండుగ వాతావరణంలో జరిగే ఈ సమావేశంలో ప్రతి నెలా జరిగే కార్యక్రమాలను ప్రక్కన పెట్టి, సభ్యులు తమ స్వీయ రచనలను చదివి వినిపిస్తారు! (రచనలు అంటే కవిత, పద్యము, గేయము లేదా క్లుప్తంగా వ్రాసిని స్వీయ అనుభవాలు మొదలైనవి). పంచాంగ శ్రవణం కూడా వుంటుంది!

అలాగే ఓ పత్యేక అతిధి శ్రీశ్రీ కవితల గురించి ప్రసంగించనున్నారు.

చిరునామా:

62 McCabe Crescent,

Thornhill, ON L4J 2Y7

ఫోను:

905-738-1521

మ్యాపు: