పుస్తక ప్రచురణలు

పుస్తక ఆవిష్కరణ

"పడమటి కనుమల్లో తరుణోదయం"

తెలుగు కథల సంకలనం

(కథకులు: మంగళా కందూర్, కొమరవోలు సరోజ, సోమయాజుల సోదరులు, శేషు అప్పారావు, నెల్లుట్ల నవీన చంద్ర)

కెనడా తెలుగు కథకుల ప్రధమ సంపుటి టొరంటో నగరంలో Albert Campbell లైబ్రరీ ఆడిటోరియంలో జూలై 25, 2009 నాడు డా.వంగూరి చిట్టెన్ రాజు గారి చే ఆవిష్కరించబడింది.

చిరంజీవులు పోతంశెట్టి మోనికా మరియు పోతంశెట్టి హారిక లు అందరినీ ఆహ్వానించారు.

శ్రీ కొమరగిరి మురళి ఈ సమావేశాన్ని MC గా నిర్వహించినారు.

శ్రీ దగ్గుపాటి రామమూర్తి గారి గణేశ , శ్రీ కొమరగిరి మధు గారి సరస్వతి ప్రా ర్థనలతో సమావేశం ప్రారంభమైనది.

శ్రీమతి గొల్లపూడి పద్మ, శ్రీ పోతంశెట్టి సత్యం, శ్రీమతి కరవడి మధుబాల మరియు శ్రీమతి కల్లూరి కమల ఈ సంకలనము లోని కథలను సమీక్షించినారు.

ఈ సమావేశములో సుమారు వందమంది ప్రేక్షకులు పాల్గొని విజయవంతము చేశారు. శ్రీ చిట్టెన్ రాజు ఉత్తర ఆమెరికా దేశపు తెలుగు కథకుల గూర్చి ప్రసంగిస్తూ తమ పుస్తకాలను కూడాపరిచయం చేశారు. వారు తమ అత్యంత రమణీయమైన వాగ్ధాటి తో ప్రేక్షకులను అలరింప చేశారు.

చిరంజీవి పిల్లారి శెట్టి అశ్విన్ ధన్య వాదాలు సమర్పించారు. చిరంజీవి కల్లూరి ఉదయ్ ఫోటోలు, వీడియోలు తీశారు. చిరంజీవి నెల్లుట్ల రాహుల్ చంద్ర స్టేజి ఏర్పాట్లు చేశారు.

సభ తర్వాత ప్రేక్షకులందరూ తేనీరు, అల్పాహారము తీసుకోవడంతో సభ ముగిసింది.

****************************************************************************