ఇది తెలుగు సాహిత్యంలో అభిరుచీ, అభిలాష వున్న టొరొంటో తెలుగు వారి సాహిత్య వేదిక!

సభ్యులందరికి తెలుగు భాషను గురించి, సాహిత్యాన్ని గురించి, చరిత్రను గురించి తెలియ జేయడం మా ప్రధాన లక్ష్యం. ప్రాచీన, అధునాతన పుస్తకాలు చదవడం, సమీక్షించడం అను రెండు వాహనాలతో ఈ లక్ష్యాన్ని సాధించాలన్నది మా ఆశయం. భారతదేశ రచయితలే గాక, ప్రవాసాంధ్రుల రచనలు కూడా మన కార్య క్రమాల్లో భాగంగా ఉండాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. తెలుగులో మాట్లాడడం, తెలుగులో పద్యాలు, కవితలు, కథలు, వ్యాసాలూ వ్రాయడం సభ్యులు సాధన చేయాలన్న లక్ష్యం కూడా వున్నది. తమ పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడినా సభ్యులు తెలుగు లోనే ప్రతిస్పందించాలని ఆశిస్తున్నాము..

ఈ వెబ్ సైట్ లోని అన్ని శీర్షికలను సందర్శించడం కొరకు మీ ఎడమవైపున వున్న విషయసూచిక లోని లింకులను నొక్కండి. ముఖ్యంగా సమాచారం పుటను తరచుగా సందర్శించండి.

ఎడమ వైపున విషయసూచిక (మెన్యూ) కనిపించక పోయినట్లయితే పైన వున్న మూడు అడ్డగీతలపై నొక్కండి.
https://sites.google.com/a/teluguvahini.com/www/home/peddana_srikrishna.jpg?attredirects=0

ఎందఱో మహానుభావులు, అందఱికీ వందనములు!!